భూకంపం వస్తే ఏం చేయాలి?

✦ భూమి కంపించగానే భయపడకండి. తొందరపడి బయటకు పరుగెత్తకుండా ప్రశాంతంగా ఉండండి.
✦ కిటికీలు, అద్దాలు, అల్మారాలు విరిగే ప్రమాదం ఉంటుంది. వాటికి దూరంగా ఉండండి.
✦ షాక్ లేదా పేలుళ్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలక్ట్రిక్ స్విచ్‌లు, గ్యాస్ స్టవ్‌లను తాకొద్దు.
✦ భూకంపం వచ్చినప్పుడు వేగంగా బయటకు వెళ్లాలని లిఫ్ట్ వాడకండి. బదులుగా మెట్ల మార్గాన్ని ఉపయోగించండి.