వనదేవతలకు బెల్లం సమర్పించిన వినయ్ భాస్కర్
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం వనదేవతల సమ్మక్క-సారలమ్మకు ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్ సతీసమేతంగా మొక్కులు చెల్లించారు. మంగళవారం ఆ రోజుల అమ్మవారి గద్దెలను దర్శించి బెల్లాన్ని సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజారులు బెల్లం ప్రసాదం అందించి సన్మానించారు.