VIDEO: కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన

HYD: కలెక్టరేట్ ఎదుట ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఇవాళ భారీ ఆందోళన చేపట్టింది. ఎన్నికల హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు రూ. 18 వేల వేతనం, మ్యానిఫెస్టోలోని హామీలను అమలు చేయాలని వారు కోరారు. డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 25న కోఠిలోని డీఎంఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.