వైసీపీ పార్లమెంట్ పరిశీలకులుగా విజయలక్ష్మి

కోనసీమ: వైసీపీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిశీలకులుగా జక్కంపూడి విజయలక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు తాడేపల్లి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం ఆదేశాలు వెలువడ్డాయి. వైసీపీ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ శ్రేణులు పేర్కొన్నారు. ఆమెను నియమించడం పట్ల పార్టీ శ్రేణిని హర్షం వ్యక్తం చేశారు.