VIDEO: నేడు భూ పోరాటయోధుడు దాసరి వర్ధంతి

కృష్ణా: నూజివీడుకి చెందిన భూ పోరాట యోధుడు, భారతీయ కమ్యూనిస్టు పార్టీ జాతీయ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు దాసరి నాగభూషణరావుకు నేడు 17వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించేందుకు సీపీఐ సకల సన్నాహాలు చేస్తోంది. నూజివీడు మండలం దిగవల్లి గ్రామంలో దాసరి 18-8-1926న జన్మించారు. వేలాది పేద కుటుంబాలకు ఉద్యమించి భూములను అందించారు. దాసరి 82వ ఏట మృతి చెందారు.