రెండేళ్లలో సమీక్షకు సమయం దొరకలేదా?: హరీష్ రావు
HYD: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గత రెండేళ్లలో 6 గ్యారంటీలపై సమీక్ష నిర్వహించడానికి సమయం దొరకలేదా? అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 6 గ్యారంటీలపై సమీక్ష నిర్వహిస్తున్నారంటేనే ఓటమిని అంగీకరించినట్లని, 700 రోజులు గడుస్తున్నా ఎందుకు ఆరు గ్యారెంటీలపై రివ్యూ చేయలేదన్నారు. సీఎం ఎన్ని డ్రామాలు ఆడినా జూబ్లీహిల్స్ ప్రజలు నిర్ణయించుకున్నారన్నారు.