అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి

SKLM: కాశీబుగ్గ పాత బస్టాండ్‌లో గురువారం జగన్నాద్ బేహరా (50) అనుమానాస్పదంగా మృతి చెందాడు. రక్తపు మడుగులో పడి ఉన్న అతడిని పోలీసులు గుర్తించారు. మృతుని వద్ద ఉన్న ఆధార్ కార్డు ప్రకారం, అతను ఒడిస్సాలోని సౌదాసాహి సనాసత గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాశీబుగ్గ పట్టణ సీఐ సూర్యనారాయణ, ఎస్ఐ నరసింహామూర్తి సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.