మృతుడి దశదినకర్మలో పాల్గొన్న MRPS నాయకులు
MLG: వెంకటాపురం మండలం పాలంపేట గ్రామానికి చెందిన పంతుల ఐలయ్య దశదిన కర్మ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో MRPS, MSP నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మృతుడి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. వారి కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు అంబాల చంద్రమౌళి, తదితరులున్నారు.