ధర్మవరం రైల్వే స్టేషన్‌లో బాలిక, బాలుడి ఆచూకీ లభ్యం
WGL: వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన బాలిక, బాలుడు మూడు రోజుల క్రితం అదృశ్యమైన విషయం సుఖాంతమైంది. అనంతపురం జిల్లా ధర్మవరం రైల్వే స్టేషన్‌లో వీరిని పోలీసులు గుర్తించారు. ఘటనపై మిల్స్ కాలనీ పోలీసులు విచారణ చేపట్టి, ఏపీ పోలీసుల సహకారంతో ఆచూకీ కనుగొన్నారు. వారిని తిరిగి వరంగల్‌కు తీసుకురావడానికి మంగళవారం పోలీసు బృందం బయలుదేరింది.