HYDలో హనుమాన్ యాత్రకు సర్వం సిద్ధం
HYD: హనుమాన్ జయంతి శోభాయాత్రకు సర్వం సిద్ధమైంది. గౌలిగూడ నుంచి ప్రారంభమయ్యే ప్రధాన యాత్ర, 14 ఉప యాత్రలను కలుపుకుంటూ తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు సాగనుంది. నగరం అంతా కాషాయమయంగా మారి 'జై శ్రీరామ్', 'బజరంగబలి' నామస్మరణలతో మారుమోగుతోంది. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్న ఈ వేడుకను పురస్కరించుకుని పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.