యువకుడిపై కత్తితో దాడి

యువకుడిపై కత్తితో దాడి

NTR:  విజయవాడలోని సీతానగరంలో మద్యం మత్తులో ఉన్న ఇద్దరి మధ్య వివాదం తారస్థాయికి చేరడంతో ఒక యువకుడిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో బాధితుడు కిరణ్ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు రావడంతో నిందితుడు పరారయ్యాడు. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అతని పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.