తుఫాన్ పై అధికారులు అలర్ట్ గా ఉండాలి: కలెక్టర్
WGL: మొంథా తుఫాన్‌పై అధికారులు అలెర్ట్‌గా ఉండాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. సంబంధిత అధికారులతో మంగళవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. రానున్న రెండు రోజులు మొంథా తుఫాన్ ప్రభావం ఉండొచ్చని, రైతులు పంట కోతలు వాయిదా వేసుకోవాలని సూచించారు. ఇప్పటికే కోసిన ధాన్యాన్ని తడవకుండా టార్పాలిన్‌తో కప్పాలన్నారు.