విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి
తూ. గో జిల్లా నల్లజర్ల మండలం పోతవరంలో గురువారం సాయంత్రం విషాదం చోటుచేసుకుంది. వరి పంట బోదిలో ఉన్న విద్యుత్ వైరును తీసే క్రమంలో పోతవరం గ్రామానికి చెందిన మద్దూకూరి సత్యనారాయణ (53) విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.