'రైతులకు నష్టం కలగకుండా చూస్తాం'

'రైతులకు నష్టం కలగకుండా చూస్తాం'

KMM: రైతులకు నష్టం కలగకుండానే సీతారామ ప్రాజెక్టు కాలువల నిర్మాణం చేపడతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. ఆదివారం ఖమ్మంలో పర్యటించిన మంత్రిని పలువురు రైతులు కలిసి, కాలువల నిర్మాణానికి సంబంధించి తమ సమస్యలను దృష్టికి తీసుకువచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడతామని వారికి భరోసా ఇచ్చారు.