గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎమ్మెల్యే

నల్గొండ: వేసవి దృష్ట్యా గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎమ్మెల్యే సామేలు అన్నారు. శుక్రవారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొని మాట్లాడారు. మండలంలో పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వివిధ శాఖల అధికారుల నివేదికలను అడిగి తెలుసుకున్నారు.