సీఎస్‌పురం మండలంలో కారు అగ్నికి ఆహుతి

సీఎస్‌పురం మండలంలో కారు అగ్నికి ఆహుతి

ప్రకాశం: సీఎస్‌పురం మండలం కంభంపాడు సమీపంలో శుక్రవారం కారు పూర్తిగా దగ్ధమైంది. రెడ్డి గారి పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో కొద్ది నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. వాహనం నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమై కారును ఆపి బయటకు దిగడంతో ప్రాణ నష్టం తృటిలో తప్పింది. వివరాలు తెలియవలసి ఉంది.