VIDEO: ఇరువర్గాల కొట్లాట.. ఒకరికి కత్తిపోట్లు

VIDEO: ఇరువర్గాల కొట్లాట.. ఒకరికి కత్తిపోట్లు

SKLM: సారవకోట మండలం ఆగదలలో ఇవాళ ఉదయం పొలం తగాదాలో ఒకరిపై కత్తితో దాడి జరిగింది. జలుమూరు మండలానికి చెందిన బలగ నాగభూషణరావు తన సోదరి భూమిని సాగు చేస్తుండగా, బమ్మిడి జయరాం భూమి తనదంటూ గొడవకు దిగి, నాగభూషణరావుపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలైన నాగభూషణరావును పోలీసులు నరసన్నపేట ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేశారు.