VIDEO: దేవాదుల నీటి విడుదల కోసం రైతుల ఆందోళన

JN: జనగామ మండలంలో 30% మాత్రమే వర్షపాతం నమోదవ్వడంతో, సాగునీటి కోసం దేవాదుల నీటిని కాలువల ద్వారా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం రైతులు ఇరిగేషన్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఓబుల్ కేశవాపురం రైతులు మాట్లాడుతూ.. ఇరిగేషన్ ఈఈ మంగీలాల్ తమ పట్ల అమర్యాదగా మాట్లాడాడని, వెంటనే అతడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.