శాలిగౌరారంలో వేగంగా సాగుతున్న వరి కోతలు

శాలిగౌరారంలో వేగంగా సాగుతున్న వరి కోతలు

NLG: శాలిగౌరారం మండలంలో యాసంగి వరి కోతలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఏడాది సుమారు 20 వేల ఎకరాల్లో సాగు జరగడంతో పొలాల వద్ద సందడి నెలకొంది. ఎండల తీవ్రత పెరుగుతుండటంతో రైతులు కోతలను వేగవంతం చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో కోతలు ఇప్పటికే ప్రారంభమవ్వగా, మే నెల వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.