నాగర్ కర్నూల్ పీహెచ్సీని తనిఖీ చేసిన డీఎంహెచ్‌వో
NGKL: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె. రవికుమార్ శుక్రవారం నాగర్‌కర్నూల్ మండలం పెద్దముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి రికార్డులు, హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.