VIDEO: ప్రశాంతంగా ప్రారంభమైన పదవ తరగతి పరీక్షలు

WGL: వర్ధన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు గంట ముందే చేరుకున్నారు. పరీక్ష రాస్తున్న విద్యార్థులు వెంట వారి తల్లిదండ్రులు రావడంతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.