పేదలను ఆదుకోవడంలో యువత ముందుండాలి: ఎమ్మెల్యే

పేదలను ఆదుకోవడంలో యువత ముందుండాలి: ఎమ్మెల్యే

కోనసీమ: పేదలకు అండగా నిలవాలని రాజోలు ఎమ్మెల్యే దేవ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం విశ్వేశ్వరాయపురంలో జరిగిన సమావేశంలో, అనారోగ్యంతో ఉన్న మోకా కళావతి కుటుంబానికి రూ. 25 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ విరాళాన్ని సేకరించిన 'యునైటెడ్ ఫ్రెండ్స్ సర్కిల్ హెల్పింగ్ హాండ్స్' సభ్యులు గుబ్బల పని, తాడి మన్మోహన్ రెడ్డి, సుమంత్‌లను ఎమ్మెల్యే అభినందించారు.