15% మరణాలకు వాయు కాలుష్యమే కారణం
దేశ రాజధాని ఢిల్లీలో 2023లో నమోదైన మొత్తం మరణాలలో దాదాపు 15% (ప్రతి 7 మరణాల్లో ఒకటి) వాయు కాలుష్యం వల్లే సంభవించినట్లు గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్(GBD) నివేదిక వెల్లడించింది. వాతావరణంలోని ధూళికణాల కారణంగా 17,188 మంది మరణించారని నివేదిక పేర్కొంది. వాయు కాలుష్యం తర్వాత అధిక మరణాలకు రక్తపోటు (12.5%), మధుమేహం (9%) కారణమని నివేదిక తెలిపింది.