'ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

'ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి'

నెల్లూరు: జిల్లా ఆటో కార్మిక సంఘం బుచ్చి మండల కమిటీ ఆధ్వర్యంలో ఆటో కార్మికుల సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షలు కోలగట్ల సురేష్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 21 పేరుతో ఆర్థిక భారాన్ని మోపుతూ ఇబ్బందులు పెడుతున్నాయన్నారు. వెంటనే జీవో నెంబర్ 21 రద్దు చేయాలన్నారు. కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.