విశాఖలో సమంత సందడి

విశాఖ నగరంలో ప్రముఖ నటి సమంత సందడి చేశారు. శుభం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖలో నిర్వహించారు. ఆదివారం రాత్రి జరిగిన ఈవెంట్లో చిత్ర నిర్మాత, నటి సమంత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇస్తూ సందడి చేశారు. విశాఖ అంటే తనకు ఎంతో ఇష్టమని, తన చిత్రాలను ఇక్కడ ఎంతో ఆదరించారని పేర్కొన్నారు. శుభం చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందన్నారు.