ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈసీ నది

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఈసీ నది

RR: చేవెళ్లలో రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈసీ, మూసీ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షం వల్ల ఈ నదుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈసీ నది ప్రవాహం పెరగడంతో హిమయత్ సాగర్‌కు కూడా నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.