ధాన్యం కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష

ధాన్యం కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష

AP: 2025-26 ధాన్యం కొనుగోళ్లపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 2,606 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని అధికారులు.. సీఎంకు తెలిపారు. 7.8 కోట్ల గోనె సంచులు సిద్ధం చేశామన్నారు.18.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని చెప్పారు. గతేడాదితో పోలిస్తే 32 శాతం కొనుగోళ్లు పెరిగాయని వెల్లడించారు. ఈ ఏడాది 50.75 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చేస్తున్నామని పేర్కొన్నారు.