967 చెరువులు.. 4.5 కోట్ల చేప పిల్లలు

NZB: మత్స్య కార్మిక కుటుంబాల ఉపాధిని మెరుగుపర్చి, వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేసేందుకు నాణ్యమైన చేప పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని NZB కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి అధికారులకు సూచించారు. సోమవారం ఆయన మత్స్యశాఖ పని తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది 967 చెరువుల్లో 4.5 కోట్ల చేప పిల్లలను వదలాలని నిర్ధేశించిన లక్ష్యం అన్నారు.