నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
నంద్యాల: ఆత్మకూరు మండలంలో బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ రామ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఆత్మకూరులోని సబ్ స్టేషన్లో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 8 ఎంవీఏ పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.