అన్నమయ్య జిల్లాలో అర్ధరాత్రి నలుగురు మృతి

అన్నమయ్య: జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు. ములకళచెరువు మండలం బురకాయలకోట పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి ఓ వాహణం ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. గంటల వ్యవధిలోనే అదే మండలంలోని పెద్దపాళెం బ్రిడ్జివద్ద RTC బస్సు-బైక్ ఢీకొని కుటాగలవారిపల్లికి చెందిన ముగ్గురు యువకులు మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.