'టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి'

'టీటీడీ ఛైర్మన్ రాజీనామా చేయాలి'

AKP: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని వైసీపీ పాయకరావుపేట నియోజకవర్గం సమన్వయకర్త కంబాల జోగులు డిమాండ్ చేశారు. తిరుమలను అపవిత్రం చేసినందుకు నిరసనగా నక్కపల్లి మండలం ఉపమాక వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఇంతవరకు నాయుడుని పదవి నుంచి తొలగించకపోవడం శోచనీయం అన్నారు. వైసీపీ జిల్లా కార్యదర్శి వీసం రామకృష్ణ పాల్గొన్నారు.