వేంపాడులో సురక్షిత మాతృత్వంపై అవగాహన సదస్సు
NLG: వేంపాడులో సురక్షిత మాతృత్వంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బుర్రి స్వాతి పరమేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలింతలు, గర్భిణీలకు ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి టీకాలు (వ్యాక్సినేషన్) వేశారు. తల్లీబిడ్డల ఆరోగ్యమే ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా సర్పంచ్ పేర్కొన్నారు.