ఉలవపాడు ఘటనపై స్పందించిన మంత్రి
NLR: ఉలవపాడులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి లోకేష్ 'X' ద్వారా స్పందించారు. 'నా పర్యటనకు వచ్చి తిరిగి వెళ్తుండగా గాయపడటం బాధాకరం. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించాం. గాయపడిన వారు ఉలవపాడు, కావలి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారికి అన్ని విధాలా అండగా ఉంటాం' అంటూ పేర్కొన్నారు.