VIDEO: యూరియా కోసం రాస్తారోకో

MDK: శివంపేట మండల కేంద్రంలో మంగళవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని రైతులు యూరియా కోసం ఉదయాన్నే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనం వద్దకు విచ్చేశారు. పెద్ద ఎత్తున విచ్చేసి క్యూలైన్లుగా చెప్పులు ఇటుకలను పెట్టారు. అనంతరం అక్కడే యూరియా కేటాయింపు చేయాలని డిమాండ్ చేస్తూ తూప్రాన్ నర్సాపూర్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.