పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే

పవన్ కళ్యాణ్‌ను ఆహ్వానించిన ఎమ్మెల్యే

సత్యసాయి: పుట్టపర్తి నియోజకవర్గ అభివృద్ధికి రూ.35 కోట్ల నిధులు కేటాయించినందుకు DY.CM పవన్ కళ్యాణ్‌కు ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులతో 19 రోడ్లు, 72 కిలోమీటర్ల మేర రహదారులు అభివృద్ధి చెందనున్నాయి. ఈ సందర్భంగా రహదారి పనుల ప్రారంభోత్సవానికి రావాలని పవన్ కళ్యాణ్‌ను ఎమ్మెల్యే ఆహ్వానించారు.