VIDEO: ఆటో బోల్తా.. ఐదుగురికి తీవ్ర గాయాలు
సత్యసాయి: పెనుకొండ కొండపై శుక్రవారం ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి వచ్చిన ఒకే కుటుంబానికి చెందిన సభ్యులు ఆటోలో కొండపైకి వెళ్ళి వస్తుండగా డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు వెంటనే వారిని పెనుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.