'డ్రగ్స్‌తో కలిగే నష్టాలపై అవగాహన ఉండాలి'
SKLM: డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన పెంచేందుకు విస్తృత ప్రచారం అవసరమని రిటైర్డ్ DRO వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై మంగళవారం శ్రీకాకుళంలో సైకిల్ యాత్ర నిర్వహించారు. వివిధ శాఖల సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు, గంజాయి సాగు గుర్తించి నివారణకు చర్యలు అవసరమన్నారు.