నేరాల నియంత్రణే పోలీసుల లక్ష్యం

PDPL: నేరాల నియంత్రణే పోలీసుల లక్ష్యమని ముత్తారం ఎస్సై నరేష్ తెలిపారు. బుధవారం సాయంత్రం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ప్రజలకు డయల్ 100, రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.