పాఠశాలల వద్ద పొగాకు విక్రయం.. నలుగురిపై కేసులు
HNK: కాజీపేట పట్టణంలోని మడికొండలో విద్యాలయాల సమీపంలో పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మడికొండ, తరాలపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలు, సెయింట్ మ్యాథూస్ పాఠశాలల వద్ద సిగరెట్లు అమ్ముతున్న చంద్రమొగిళి, వేణు, కుమారస్వామి, రమేశ్‌లపై కేసులు నమోదు చేసి సిగరెట్లను స్వాధీనం చేసుకున్నట్లు శుక్రవారం ఇన్స్‌పెక్టర్ కిషన్ తెలిపారు.