మంచు అందాల కోసం క్యూలో పర్యాటకులు
ASR: డుంబ్రిగూడ మండలంలో విస్తరించిన మంచు దృశ్యాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఆదివారం ఉదయం నుంచే చాపరాయి, అంజోడా, పైనరి సహా పలు పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులు క్యూలు కడుతున్నారు. తెల్లని పొగమంచు మధ్య ప్రాంతాల మనోహర దృశ్యాలను తిలకిస్తూ పర్యాటకులు ఫోటోలు, వీడియోలు తీసుకుంటూ మంత్రముగ్ధులవుతున్నారు.