'బాల్య వివాహాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి'

వనపర్తి జిల్లాలో బాల్య వివాహాలు జరుగకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ ఎన్ఐసీ హాల్‌లో జిల్లా సంక్షేమ శాఖ సీడీపీవోలు, సూపర్వైజర్‌లు, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. గత మూడు నెలల్లో 25 మంది బాలికలకు బాల్య వివాహాలు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని పేర్కొన్నారు.