ఏడుగురు పేకాటరాయలు అరెస్ట్

ఏడుగురు పేకాటరాయలు అరెస్ట్

అన్నమయ్య: పీలేరు మండలం సదుం రోడ్డులోని కొత్తపేట సమీపంలో పేకాట ఆడుతున్నారనే సమాచారంతో ఎస్సై లోకేశ్ ఆధ్వర్యంలో శనివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఏడుగురు పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారివద్ద నుంచి 52 పేక ముక్కలు, రూ.7,850 నగదు, 7 సెల్‌ఫోన్లు, 2 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.