రోడ్డు ప్రమాదం.. పాస్టర్ మృతి
సూర్యాపేట జిల్లా నాగారం-జనగాం ప్రధాన రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. జేసీబీ ఆటోను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న పాస్టర్ ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు వర్ధమాను కోటకు చెందినవాడిగా స్థానికులు గుర్తించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.