విద్యార్థినిని అభినందించిన కలెక్టర్
PDPL: ధర్మారం మండలం రచ్చపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 3వ తరగతి చదువుతున్న సాన్విక శ్రీని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అభినందించారు. FLN కార్యక్రమంలో భాగంగా సాన్విక శ్రీ ఇంగ్లీష్ రీడింగ్ కాంప్రహెన్షన్ వీడియో క్లిప్పును పెద్దపల్లి సమావేశంలో ప్లే చేసి వినిపించారు. ఆమె చక్కగా చదివి మాతృభాష తెలుగులో విపులంగా వివరించగా కలెక్టర్ ఆమెను అభినందించారు.