నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి: ఎమ్మెల్యే
కృష్ణా: కల్తీ మద్యం కేసులో నిందితులను జైలుకు పంపడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేయాలని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. కల్తీ మద్యంపై అరెస్టులు గత నెల రోజులుగా జరుగుతున్నాయన్నారు. జోగి రమేష్ గత వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం దందా నిర్వహించడని ఆయన ఆరోపనలు చేశారు. నిందితుల ఆస్తులను వెంటనే జప్తు చేసి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎంను కోరారు.