కార్యకర్త మృతి.. పరామర్శించిన ఎమ్మెల్యే

CTR: నగరి రూరల్ మండలం బీరకుప్పం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు A.కమలకన్నన్ సోమవారం అనారోగ్య కారణంగా మరణించారు. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని, పార్టీ అండగా ఉంటుందని చెప్పారు.