సంగారెడ్డి జిల్లాకు 10 వేసవి క్రీడా శిబిరాలు
సంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో 10 సమ్మర్ క్యాంపులు మంజూరైనట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. వీటి నిర్వహణకు ఆసక్తి గల పీడీలు, జాతీయ క్రీడాకారులు ఈనెల 22న కలెక్టరేట్లోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ శిబిరాలు ఏప్రిల్ 24 నుంచి జూన్ 7వ తేదీ వరకు కొనసాగుతాయని, గ్రామీణ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.