ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన DMHO
HNK: ఆరోగ్య సమస్యలతో PHC లకు వచ్చేవారికి ఓపికతో సమస్యలను విని, అవసరమైన సేవలు అందించాలని DMHO డా. అల్లం అప్పయ్య సిబ్బందికి సూచించారు. ఇవాళ ఆయన ఎల్కతుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ మేరకు OP రిజిస్టర్‌ని పరిశీలించారు. ఎంతమంది రోగులు వస్తున్నారు, ఏ విధమైన సమస్యలతో వస్తున్నారు, వారికి ఏ విధమైన చికిత్స అందిస్తున్నారనే విషయాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.