'గ్రామపాలనాధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

'గ్రామపాలనాధికారులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి'

KMM: గ్రామపాలనాధికారులు నిస్వార్ధంగా పనిచేస్తూ ప్రజలకు విశిష్ట సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అన్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్, నూతనంగా నియమించిన గ్రామ పరిపాలన అధికారులకు సోమవారం పోస్టింగ్ ఆర్డర్‌లను అందజేశారు. జిల్లాలో 299 క్లస్టర్‌లకు గాను 252 మంది అర్హులైన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పోస్టింగ్ ఇచ్చామని పేర్కొన్నారు.