VIDEO: స్థానిక కూలీల కొరత.. రైతులకు ఇబ్బందులు

VIDEO: స్థానిక కూలీల కొరత.. రైతులకు ఇబ్బందులు

NRML: లోకేశ్వరం మండలంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు మొక్కజొన్న, జొన్న పంటలు పూర్తిగా నేలకొరిగాయి. కోతకు స్థానిక కూలీలు ముందుకు రావడం లేదు. దీంతో రైతులు మహారాష్ట్ర నుంచి కూలీలను రప్పిస్తున్నారు. ఎకరానికి రూ. 3,500 నుంచి రూ.5,000 వరకు చెల్లించడమే కాకుండా, వారికి వసతి కల్పిస్తున్నారు. ఈ మేరకు పెట్టుబడి పెరిగి, దిగుబడి తగ్గి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.